Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యకు పెద్దపీట వేస్తోందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టడీ సర్కిళ్లు కేవలం పోటీ పరీక్షల శిక్షణా కేంద్రాలుగానే కాకుండా, యువతకు ఉద్యోగ, ఉపాధిని అందించే భరోసా కేంద్రాలుగా అభివద్ధి చెందాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారని టీఆర్ఎస్వీ విద్యార్థులు తెలిపారు. బుధవారం ఓయూలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ. రాష్ట్రంలోని స్టడీ సర్కిళ్ల ద్వారా దేశవ్యాప్తంగా ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల వివరాలు సహా యువత చదువుకు తగ్గ ఉద్యోగ ఉపాధి సమాచారాన్ని, గైడెన్స్ ను అందించే కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సీఎం నిర్ణయం హర్షణీయం అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఒక్కో వర్గానికి ఒకటి చొప్పున 33 జిల్లాల్లో జిల్లాకు 4 చొప్పున మొత్తం 132 స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయడం చాలా హర్షించదగ్గ విషయం అని టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దమ్మ రమేష్ అన్నారు. పాలిటెక్నిక్, ఫార్మా, కెమికల్, ఇండిస్టీ, డిఫెన్స్, రైల్వే, బ్యాంకింగ్, నర్సింగ్, అగ్రికల్చర్ తదితర కోర్సులను పూర్తి చేసుకున్న తెలంగాణ యువతీ యువకులకు దేశవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధిని కల్పించే అద్భుతమైన భూమికను స్టడీ సర్కిళ్లు పోషించనున్నాయి వారు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న గురుకుల డిగ్రీ కళాశాలకు అదనంగా మరో 15 మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలను ఈ విద్యా సంవత్సరం నుంచే ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించడం బీసీ విద్యార్థులకు శుభ పరిణామం అని అన్నారు. సమావేశంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి రాజేష్ నాయక్ శ్రీకాంత్ గౌడ్, రమేష్ గౌడ్, బొల్లు నాగరాజు యాదవ్, సందీప్ మేకల, రాకేష్ , సాయి, నాగేంద్ర రావు, మధు, శ్రీశైలం, ఓయూ నాయకులు పాల్గొన్నారు.