Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరెడ్ మెట్
అల్వాల్ సర్కిల్ వెంకటాపురం డివిజన్ ఇందిరానగర్లో అధ్వాన్న స్థితిలో ఉన్న రోడ్లు, మాన్ హౌల్స్, పాడైపోయి శిథిలావస్థలో ఉన్న బోర్ల విషయంలో తక్షణమే స్పందించి తగు మరమ్మత్తు చర్యలు తీసుకోవాలని కోరుతూ అల్వాల్ పట్టణ కాంగ్రెస్ శ్రేణి నాయకులు అల్వాల్ సర్కిల్ అసిస్టెంట్ కమిషనర్ హేమలతకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నిమ్మ అశోక్ రెడ్డి, కంటెస్టెడ్ కార్పొరేటర్ టీఎస్.సంజీవ్ కుమార్, వెంకటాపురం డివిజన్ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసులు, ముత్యాలమ్మ, జ్యోతి, శ్రీనివాస్, హరీష్ బాబు, హరికృష్ణ, వేణుగోపాల్, శ్రీనివాసులు పాల్గొన్నారు.