Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
వ్యాక్సిన్ తయారీదారు ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ (ఐఐఎల్) దేశవ్యాప్తంగా అంతర్జాతీయ జునోసిస్ దినంను పురస్కరించుకుని జూనోటిక్ వ్యాధులకు వ్యతిరేకంగా ఉచిత వ్యాక్సినేషన్ శిబిరాన్ని నారాయణగూడలోని గవ ర్నమెంట్ సూపర్ స్పెషాలిటీ వెటర్నరీ హాస్పిటల్లో బుధవారం నిర్వహించింది. జంతువుల నుంచి మానవులకు సంక్రమించే వ్యాధులను జూనోటిక్ వ్యాధు లంటారు. జునోటిక్ అనారోగ్యాలకు వ్యతిరేకంగా మొట్టమొదటిసారిగా టీకాలను వేసిన రోజును పురస్కరించుకుని నిర్వహిస్తుంటారు. జునోటిక్ వ్యాధుల పట్ల అవగాహన మెరుగుపరచడంలో భాగంగా నిర్వహించే ఈ కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకమైనది. నేడు, ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లక్షకు పైగా మోతాదుల రక్షారబ్, స్టార్వాక్ ఆర్ (ఐఐఎల్ యొక్క యాంటీ రేబిస్ వ్యాక్సిన్లు ) ఉచితంగా అందించింది. తమ వినూత్నమైన ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల ద్వారా జంతు వులు, మానవుల కోసం మెరుగైన ఆరోగ్యం అందించాలనే దివగా ప్రారంభించిన సహకార ప్రయత్నం 'ఒన్హెల్త్ 'లక్ష్యం చేరుకునే దిశగా ఈ కార్యక్రమం చేశారు. ఇటీవలి కాలంలో విడుదల చేసిన 'ప్రపంచంలో అడవుల స్ధితి 2022' నివేదికల ప్రకారం దేశంలో జునోటిక్ వ్యాధులు సంక్రమించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం భయపెడుతున్న రేబీస్, స్వైన్ ఫ్లూ, బ్రూసెల్లోసిస్, లెప్టోస్పై రోసిస్, పోర్సిన్ సిస్టిసెరోసిస్, జికా మొదలైన 70శాతానికి పైగా రోగాలు నిజా నికి జంతువుల నుంచి సంక్రమించినవి. ఈ తరహా జునోటిక్ వైరస్ల వ్యాప్తిని అడ్డుకోవడంలో భాగంగా ఐఐఐఎల్ వ్యాక్సినేషన్ శిబిరాలను భారతదేశ వ్యాప్తంగా 100 నగరాలలో వెటర్నరీ డిస్పెన్సరీలు, వెటర్నరీ కాలేజీలు, ఎన్జీవోల ద్వారా నిర్వహించారు. చాలా వరకూ మానవ రేబీస్ మరణాలకు కుక్కలు ప్రధాన కార ణంగా నిలుస్తున్నాయి. మానవులకు రేబీస్ వ్యాధి సంక్రమణకు దాదాపు 99 శాతం ఇవి కారణమవుతున్నాయి. రేబీస్ పరంగా ఇండియా ఎండెమిక్ స్థానంలో ఉంది. ప్రపంచంలో జరుగుతున్న రేబీస్ మరణాలలో 36శాతం ఇక్కడే జరుగు తున్నాయి. రేబీస్ భారం పూర్తిగా తెలియదు. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న డాటా ప్రకారం ప్రతి ఏడాదీ 18000-20000 మరణాలు రేబీస్ కార ణంగా సంభవిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా పురుషులు, చిన్నా రులపై రేబీస్ అధికంగా ప్రభావితం చూపుతుంది. కుక్క కాటుకు గురైన తర్వాత తగినంతగా చికిత్స తీసుకోకపోవడం కూడా దీనికి కారణమే. పలుదేశాలలో రేబీస్ కారణంగా జరుగుతున్న మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీనికి శునకాలకు వ్యాక్సిన్లు ఇవ్వడం ఓ కారణం. అవగాహన మెరుగుపడటం, ఖచ్చి తంగా రోగ నిర్థారణ చేయడం, పారిశుద్ధ పరిస్ధితులు మెరుగుపరచడం, రోగ నిరోధక టీకాలు వేయించడం వంటి అన్ని చర్యలనూ తీసుకోవడం ద్వారా ఈ వ్యాప్తిని అడ్డుకోవచ్చు. ఈ సందర్భంగా ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె.ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ''అసలైన ఒన్ హెల్త్ కంపెనీగా ఐఐఎల్ నిబద్ధతకు నిదర్శనంగా అందుబాటు ధరలలో వ్యాక్సిన్లను మానవులతో పాటు జంతువుల ఆరోగ్యం కోసం కూడా తీసుకురావడం. మా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ డ్రైవ్ ద్వారా మేం ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పిస్తు న్నాం. రక్షారబ్ తో పాటు స్టార్వాక్ ఆర్ తో ఐఐఐఎల్ ఇప్పుడు దేశంలో భారీ సంఖ్యలో జునోటిక్ వ్యాక్సిన్లను తీసుకువచ్చింది. వీటిలో సిస్వాక్స్, బ్రూవాక్స్, ఇతరాలు ఉన్నాయి. స్థిరంగా మేం వినూత్నమైన వ్యాక్సిన్లను తీసుకురావడం ద్వారా వృద్ధి చెందుతున్న జునోటిక్ ప్రమాదాలను అరికట్టగలం'' అని తెలిపారు.