Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
అపోలో హాస్పిటల్స్, మోటారు స్టేట్ డయాగస్టిక్స్ అప్లికేషన్లో అగ్రగామిగా ఉన్న కనెక్టెడ్ల్కెఫ్తో ఆరోగ్యం, రోగి కండీషన్ మేనేజ్మెంట్, ఇతర ఆరోగ్య కేంద్రీకృత అప్లికేషన్ల కోసం అపోలో తన ఏఐసీవీడీ టూల్‌ను కనెక్టెడ్ల్కెఫ్ డిజిటల్ సొల్యూషన్స్‌తో అనుసంధానం చేసే ఒక విలక్షణమైన భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు ప్రకటిం చింది. వర్చువల్‌గా జరిగిన ఈ కార్యక్ర మంలో అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మెన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి మాట్లాడుతూ ''గుండె సంబంధిత వ్యాధుల కారణంగా పెరుగు తున్న ఎన్సీడీల భారం పనిచేసే వయస్సులో ఉన్న మన జనాభాలో పెరుగుతున్న అతి ప్రధానమైన సమస్య. ఎన్సీడీల కారణంగా సంభవించే అకాల మరణాలు సామాజికంగా, ఆర్థికంగా పెను ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. ప్రారంభంలోనే రోగనిర్ధారణ, వైద్య చికిత్స అందిస్తే అది సానుకూలమైన ప్రభావాన్ని చూపుతుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదా న్ని ముందుగానే అంచనా వేయగలిగే టూల్స్ వైద్యుల వద్ద లేవు. కనెక్టెడ్ల్కెఫ్ సహకారంతో వైద్యులు ప్రమాదాన్ని ముందుగానే అంచనా వేయడానికి, రోగులకు అత్యుత్తమమైన క్లినికల్ ఫలితాలను అందించడానికి ఒక సమ గ్రమైన టూల్‌ను అందించడంలో కనెక్టెడ్ల్కెఫ్ హెల్త్‌కేర్ సొల్యూషన్స్‌తో కలిశాం'' అని తెలిపారు. అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతా రెడ్డి మాట్లాడుతూ ''నివారణను వేగవంతం చేయడంలో, వ్యాధి భారాన్ని తగ్గించడంలో ప్రివెంటివ్ హెల్త్‌కేర్ సాంకేతికత ఎలా ఉపయోగపడుతుందనేదానికి భారతీయ ప్రజల హార్ట్ రిస్క్ స్కోర్ ఒక ఉదాహరణ. ఈ సహకారం క్లినికల్ ఏఐలో సహ-అభివృద్ధి కోసం మా పరిశోధనను మరింత బలోపేతం చేస్తుంది'' అని తెలిపారు. కనెక్టడ్ల్కెఫ్, వ్యవస్థాపకుడు అండ్ సీఈఓ డారిల్ ఆర్నాల్డ్ మాట్లాడుతూ '' కనెక్టెడ్ల్కెఫ్ విత్ ఫిట్బిట్తో గుండె జబ్బుల ప్రమాదాన్ని నిరంతరంగా, వేగంగా, సులభంగా అంచనా వేయడానికి స్మార్ట్‌ఫోన్, ధరించగలిగే పరికరాలను ఆవిష్కరించడానికి, వర్తింపజేయడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం'' అని తెలిపారు.