Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ హరీశ్
నవతెలంగాణట-మేడ్చల్ కలెక్టరేట్
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లావ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలపై దాడులకు సంబంధించి వేగవంతంగా స్పందించి కేసులు నమోదు చేయాలని. వాటిని సత్వరమే పరిష్కరించేలా అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ హరీశ్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివద్ధి శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డితో పాటు కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలపై దాడులకు సంబంధిత శాఖల అధికారులు తక్షణమే స్పందించి కేసులు నమోదు చేయడంతో పాటు వాటిని త్వరగా విచారణ చేపట్టాలన్నారు. అలా చేసినప్పుడే బాధితులకు సరైన న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ విషయాల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కేసులు నీరుగారుతాయని అన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులకు సంబంధించి బాధితులు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు వేగవంతంగా కేసు పూర్తయ్యేలా చూడాలని వివరించారు. ఈసందర్భంగా కేసులకు సంబంధించి జిల్లాలోని ఆయా శాఖ వారీగా కలెక్టర్ సంబంధిత అధికారులను అడిగి తెలుసుకొన్నారు. ఈ మేరకు కమిషన్‌లోని పలువురు సభ్యులు జిల్లాలో ఉన్న సమస్యలను కలెక్టర్ దష్టికి తీసుకురాగా అందుకు అవసరమైన చర్యలు తీసుకొని వాటిని పరిష్కరిస్తామని కలెక్టర్ హరీశ్ స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. అలాగే వారికి న్యాయం అందించేందుకు విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, డీసీపీలు రక్షితామూర్తి, సందీప్, జిల్లా ఎస్సీ డెవలప్మెంట్ అధికారి బాలాజీ, వినోద్, కమిషన్ సభ్యులు, జిల్లా శాఖ అధికారులు, విజిలెన్స్ కమిటీ సభ్యులు, వెంకటేశ్వర రావు, ధనరాజ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.