Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చార్మినార్ డిప్యూటీ కమిషనర్ ఎస్ఎన్ కుమార్
నవతెలంగాణ-ధూల్‌పేట్
వినాయక చవితికి మట్టి గణపతులను ఏర్పాటు చేసి పర్యావరణాన్ని పరిరక్షించాలని జీహెచ్ఎంసీ చార్మినార్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సదాశివ నారాయణ సూర్య కుమార్ అన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ గణపతి వద్దు.. మట్టి గణపతి ముద్దు... అంటూ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నందు మట్టిగణపతిని ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ గణపతిలతో కెమికల్ వంటివి భూమిలో వాతావరణంలో మిళితమై కాలుష్యం ఏర్పడుతుందన్నారు. దీంతో మానవ మునగడకు, జంతు పక్షాదులకు ప్రమాదకరమన్నారు. మట్టి గణపతులను పూజిద్దాం పర్యావరణ పరిరక్షణ కాపాడుకుందాం అని సందర్శకులకు, స్థానికులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ సర్కిల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.