Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
రాబోయే బోనాల ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని రోడ్డు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని బాగ్ అంబర్‌పేట డివిజన్ కార్పొరేటర్ బి.పద్మ వెంకటరెడ్డి అన్నారు. గురువారం బాగ్ అంబర్‌పేట డివిజన్ బురుజుగల్లీలో కార్పొరేటర్ పర్యటించి తవ్వి వదిలేసిన రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా రాబోయే బోనాల ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని ఆలయాలకు వచ్చే భక్తులు, తొట్టెలు, ఫలహారపు బండ్లు, పోతరాజులకు ఎలాంటి ఇబ్బందులకు కలుగకుండా అసంపూర్తిగా వదిలేసిన రోడ్ల నిర్మాణపనులను పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ అధికారులను కోరారు. కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా బీజేపీ ఇన్చార్జ్ బి.వెంకట్ రెడ్డి, బాగ్ అంబర్‌పేట డివిజన్ అధ్యక్షులు చుక్క జగన్, ప్రధాన కార్యదర్శి జమ్మిచెట్టు బాలరాజు, నాయకులు మిర్యాల శ్రీనివాస్, సాయి ఠాకూర్, వంగూరి సుధాకర్, రామ్‌రెడ్డి, సుజాత, సునంద, సరళ, మహేశ్వరి, సుగుణ తదితరులు పాల్గొన్నారు.