Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ డాక్టర్ పిడమర్తి రవి
నవతెలంగాణ-ఓయూ
బీజేపీ బహిరంగ సభలో మాదిగలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. ఈనెల 10న తలపెట్టిన మాదిగల అలరు బలరు కార్యక్రమ గోడపత్రికను బీఎస్ఎఫ్ అధ్యక్షులు బోరెల్లి సురేష్‌తో కలిసి ఆవిష్కరించారు. మాదిగల అభివద్ధి నోచుకోని మనువాద కులరక్కసి పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది బీజేపీ మాత్రమే అని, మాదిగలపై జరిగిన దాడికి కౌంటర్‌గా ప్రతి దాడి చేసే దమ్ము ధైర్యం మాదిగలకు ఉందని అన్నారు. వచ్చే ఎన్నికలలో బీజేపీకి మాదిగ సమాజం మొత్తం తగిన బుద్ధి చెబుతుందని, ఓటు చైతన్యం ద్వారానే కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని అన్నారు. ఈనెల 10 జరిగే మాదిగల అలరు బలరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఇందులో రాష్ట్రంలోని మాదిగ మేధావులు కవులు, కళాకారులు, ప్రజాప్రతినిధులు అన్ని పార్టీల నుంచి హాజరవుతారని చెప్పారు. కార్యక్రమంలో టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఇటుక రాజు మాదిగ, రాష్ట్ర అధ్యక్షులు గడ్డ యాదయ్య మాదిగ, మహా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ముత్యపాక నరసింహారావు, మాదిగ జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్ వడ్డె ఎల్లయ్య, విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రామగల సుందర్, టీడీడీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మొగులయ్య, మోదుగు లాజర్, జోగు గణేష్, దేవరకొండ నరేష్, రాజేష్ మాదిగ, సాంబశివుడు, జెర్రిపోతుల పాండురంగ, ధనరాజ్, సుధీర్, ఇటుక గోపి, రమ్య, మీసాల రాంబాబు, శేఖర్ పాల్గొన్నారు.