Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగస్టు 7న ఢిల్లీలో జాతీయ ఓబీసీ మహాసభ
- 8న పార్లమెంట్ ముట్టడి
- తెలంగాణ, ఆంధ్ర అధ్యక్షులు జాజుల, కేసన వెల్లడి
నవతెలంగాణ-అంబర్‌పేట
జాతీయ జనగణలో బీసీ కుల గణన చేపట్టాలని లేదంటే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు వెల్లడించారు. ఆగస్టు 7న వేలాది మందితో ఢిల్లీలోని కలకోటోర్ స్డేడియంలో జాతీయ బీసీ మహాసభ, 8న పార్లమెంట్ ముట్టడిస్తామని ప్రకటించారు. గురువారం హైదరాబాద్ అంబర్‌పేటలోని మహేంద్ర గార్డెన్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మెన్ కుందారం గణేష్ అధ్యత వహించగా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, కేసన శంకర్రావు హాజరై ప్రసంగించారు. దేశవ్యాప్తంగా అరవై కోట్ల మంది బీసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిమార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోతుందన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వంపై సమభేరి మోగించడానికి దేశంలోని 29 రాష్ట్రాల నుంచి వేలాదిగా బీసీలతో ఆగస్టు 7న ఛలో ఢిల్లీ ఆందోళన చేపడతామని చెప్పారు. మూడు రోజుల పాటు ఢిల్లీలో సభలు, సమావేశాలు, ముట్టడి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. బీసీ గణనన, ప్రత్యేక మంత్రిత్వశాక, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలలో రిజర్వేషన్లు తదితర డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని చేపడతామని తెలియజేశారు. ఆగస్టు 7న జరిగే జాతీయ ఓబీసీ మహాసభకు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తున్నామని, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మంత్రులు, ఎంపీలు, పార్టీ అధ్యక్షులను ఆహ్వానించనున్నట్లు వారు చెప్పారు. మహాసభకు ఆంధ్ర, తెలంగాణ నుంచి పార్టీలకు అతీతంగా వేలాది మంది బీసీ ప్రతినిధులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. బీసీ కులాల లెక్కలపై ఇప్పటికే 22 రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయని, ఇప్పటి వరకు మద్దతు తెలపని ఆయా రాజకీయ పార్టీల కార్యాలయాల ముందు ధర్నా చేపడతామని అన్నారు. సమావేశంలో బీసీ నేతలు కనకల శ్యాంకుర్మ, కుల్కచర్ల శ్రీనివాస్, తాటికొండ విక్రమ్‌గౌడ్, మణి మంజరి, కొత్తపల్లి సదీష్కుమార్, అన్నవరపు నాగమల్లేశ్వర్రావు, సింగం నగేష్, ముప్పన వెంకటేశ్వరరావు, గొడుగు మహేష్ యాదవ్, వరికుప్పల మదు, పానుగంటి విజయ్, నాగరాజుగౌడ్, ఇంద్రం రజక, ఎడారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.