Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐఎస్ఎఫ్ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు సతీష్ కుమార్
నవతెలంగాణ-కాప్రా
ప్రభుత్వం విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు సతీష్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం ఈసీఐఎల్‌లోని నీలం రాజశేఖర్ రెడ్డి భవన్లో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై నిర్లక్ష్య ధోరణి కనబరుస్తున్నదన్నారు. ఒకవైపు ప్రయివేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేస్తున్నామని చెబుతున్నా, క్షేత్ర స్థాయిలో మాత్రం ప్రభుత్వ విద్యాసంస్థలలో మౌలిక వసతులను పూర్తి స్థాయిలో కల్పించకుండా కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా నేటికీ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్, మరుగుదొడ్లు తదితర సమస్యలు పరిస్కారానికి నోచుకోలేదని వారు అన్నారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భవిష్యత్‌లో పెద్దఎత్తున విద్యార్థులను సమీకరించి ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్ధి నేతలు వసీం, పథ్వీ, కార్తీక్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.