Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
నవతెలంగాణ-అడిక్‌మెట్
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచడం దారుణమని, ప్రధాని మోడీకి దిగిపోయే రోజులు దగ్గరపడ్డాయని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరను నిరసిస్తూ గురువారం కవాడిగూడ, భోలక్‌పూర్ ప్రాగాటూల్స్ చౌరస్తా వద్ద ధర్నా జరిగింది. ఈ ధర్నాకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి గడిచిన ఎనిమిదేండ్లల్లో గ్యాస్ ధరలను విపరీతంగా పెంచుతూ వస్తున్నారన్నారు. 2014లో రూ.400 ఉన్న గ్యాస్ ధరను ప్రస్తుతం 1100 వందల రూపాయలకు పైగా పెంచి పేదోడి నడ్డివిరుస్తున్న ఘనత మోడీదే అని ఎద్దేవా చేశారు. విద్యుత్ బిల్లలు, పెట్రోలు, డీజిల్ ధరలను పెంచడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని, వాటితో పేద ప్రజలు పెరిగిన ధరలతో సతమతమవుతుంటే కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరను పెంచడం దారుణమన్నారు. భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో మెడికల్ కాలేజీలను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మొండిచేయి చూపించిందని విమర్శించారు. ఐటీఆర్ తెలంగాణకు వచ్చిన కూడా దానిని మోడీ ఆపుతున్నారన్నారని ఆరోపించారు. కేసీఆర్ దేశానికి కావాలని ప్రజలందరూ కోరుకుంటుంటే.. దానిని మోడీ జీర్ణించుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో టీఆర్ఎస్ యువజన నాయకుడు ముఠా జైసింహా, భోలక్‌పూర్, కవాడగూడ, అడిక్‌మెట్, గాంధీనగర్, రాంనగర్ డివిజన్ల అధ్యక్షులు వై.శ్రీనివాస్, వల్లాల శ్యామ్ యాదవ్, బల్ల శ్రీనివాస్‌రెడ్డి, ఎం.రాకేష్‌కుమార్, ఆర్.మోజస్, సోమసుందరం, మారిశెట్టి నర్సింగ్ రావు, కరికె కిరణ్‌కుమార్, శ్రీధర్‌రెడ్డి, జునేద్ బాగ్దాది, లక్ష్మీ, సంధ్య, వల్లాల శ్రీనివాస్ యాదవ్, ఆర్.శ్రీనివాస్, గుండు జగదీష్, రవిశంకర్ గుప్త, పిఎస్.శ్రీనివాస్, సత్యనారాయణ, ప్రవీణ్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.