Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) 28వ వార్షికోత్సవం, మందకష్ణ మాదిగ జన్మదినోత్సవం వేడుకలను గురువారం ఓయూలో ఘనంగా నిర్వహించారు. ఓయూ లా కళాశాల డీన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షులు చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగ హాజరై ఎమ్మార్పీఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణే తమ అంతిమ లక్ష్యం అని అన్నారు. 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా మాదిగలను, ఉప కులాలను మోసం చేస్తుందన్నారు. దక్షిణ భారతదేశంలో ఉత్తరాది పార్టీల ఆగడాలను, మోసాలను మాదిగ జాతి ఇక సహించబోదని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకమైన పార్టీలను/నాయకులను తెలంగాణ గ్రామాల్లో తిరగనియొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డా.ఎర్రం నాగేంద్రం, వెలమల దశరథ్ మాదిగ, వడినాల మల్లేష్, వెంపటి సైదులు, ముత్యాల ప్రశాంత్, చెడిపల్లి రఘువరన్ మాదిగ, మామిడాల రవికుమార్, మాచారం వెంకటేష్ మాదిగ, బాబు మాదిగ, అడ్వకేట్ సుబ్బు, ఏళ్లపాగ భాస్కర్, సినపల్లి కష్ణ మాదిగ, బొల్లికొండ వేణు మాదిగ, రణధీర్ ప్రదీప్ మాదిగ, శ్రీకాంత్ మాదిగ, యేసు మాదిగ, రమేష్ రెడ్డి, పెంటయ్య మాదిగ, నాగార్జున రెడ్డి, నాగరాజు మాదిగ, ప్రభాకర్ మాదిగ, రమేష్ గౌడ్, ప్రమోద్, విలాస్, రంజిత్, వినీత్, జయదేవ్, పునీత్, ఆశన్న విద్యార్థులు పాల్గొన్నారు.