Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
ఒక ప్రాంత అభివృద్ధికి భాష, సంస్కతి సాహిత్యం దోహదం చేస్తాయని ఉన్నత విద్యా మండలి చైర్మెన్ణ ఆచార్య లింబాద్రి అన్నారు. సమాజాన్ని జాగతం చేసేవారు రచయిత లేనని ఆయన చెప్పారు. తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ కళా మందిరంలో విశ్వవిద్యాలయం నిర్వ్యహణలో వివిధ సాహితీ ప్రక్రియలలో 2019 సంవత్సరానికి గాను ఎంపికైన రచనల రచయితలకు పురస్కార ప్రదానోత్సవం జరిగింది. లింబాద్రి పాల్గొని మాట్లాడుతూ గతేడాది నుంచి డిగ్రీ విద్యార్థులకు మూడు సంవత్సరాలు తెలుగు పాఠ్యాంశాలు బోధిస్తున్నామని తెలిపారు. అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య కిషన్ రావు మాట్లాడుతూ తెలుగు సాహిత్య సేవకు అంకితమైన నిబద్ధత కల రచయితలను ఎంపిక చేసిన నిర్ణాయక సంఘానికి కతజ్ఞత తెలిపారు. త్వరలో బాచుపల్లిలో నిర్మాణమైన విశ్వవిద్యాలయంలోకి తరలనున్నట్లు తెలిపారు. కవి నందిని సిధారెడ్డి పురస్కార గ్రహీతలను అభినందించారు. రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ నివేదిక సమర్పించారు.