Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ మాదిగ పరి రక్షణ సమితి
నవతెలంగాణ-బంజారాహిల్స్
మాదిగలపై టీఆర్ఎస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి(టీఎంఎస్) వ్యవస్థాపక అధ్యక్షులు గారె వెంకటేష్ మాదిగ అన్నారు. హైదరాబాద్ నగర నడిబొడ్డున రెండెకరాల స్థలంలో అన్నీ సౌకరాÊలతో మాదిగ భవనం నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని ఓ హోటల్ గ్రేటర్ హైదరాబాద్ ముఖ్యనాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు గారె వెంకటేష్ మాదిగ మాట్లాడుతూ కార్పొరేట్, ప్రయివేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజుల రూపంలో రక్తం తాగుతున్నారని చెప్పారు. ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్త శుద్ధి ఉన్నా కార్పొరేట్, ప్రయివేట్ పాఠశాలల, కళాశాలలకు కళ్లెం వేసి ఫీజులను అరికట్టాలని డిమాండ్ చేశారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టభద్దత కల్పించి వర్గీకరణను అమలు చేయాలన్నారు. లేకపోతే బీజేపీ రాష్ట్రం నుంచి తరిమి కొడతామని హెచ్చరించారు. సమావేశంలో టీఎంఎస్ రాష్ట్ర కోఆర్డినేటర్ మానాలా రాజేశ్వర్ మాదిగ, రాష్ట్ర ఉపాధ్యక్షులు సెవెల లక్ష్మణ్, శ్రీహరి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు సంపత్, రాష్ట్ర మీడియా ఇన్చార్జ్ మానేరు లూకా, గ్రేటర్ హైదరాబాద్ మీడియా ఇన్చార్జ్ నర్సింగారావు, నాయకులు శ్యామ్, మధు, రాజన్, కుమార్, సుధాకర్ పాల్గొన్నారు.