Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాంపల్లి ఎమ్మార్వో ఎంవీవీ ప్రసాద రావు
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
మూడు, నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నాంపల్లి ఎమ్మార్వో ఎంవీవీ ప్రసాద రావు సూచించారు. సోమవారం ముస్లిం జంగ్ బ్రిడ్జి, గణేష్ టెంపుల్, చూడి బజార్, అంబేద్కర్ నగర్, దేవీనగర్, చంద్ర కిరణ్ బస్తీ ప్రాంతాల్లో సందర్శించారు. మూసీని ఆనుకొని నివసిస్తున్న ప్రజలు మూసి ఉప్పొంగినట్లయితే దగ్గరలోని కమ్యూనిటీ హాల్, ప్రభుత్వ పాఠశాలలకు తరలివెళ్లాలని సూచించారు. ప్రజలకు ఎప్పుడు వీఆర్వోలు అందుబాటులో ఉంటారని చెప్పారు. హైదరాబాద్ నగర జంట జలాశయాల్లో ఒకటైన ఉస్మాన్ సాగర్ (గండిపేట్), హిమాయత్ సాగర్‌లో నీరు ఎక్కువ చేరనుండడంతో మూసీ పరివాహక ప్రాంతంలో ఆనుకొని ఉన్న ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎమ్మార్వో ఎ.రాజేశ్వర్, వీఆర్వోలు ఏ కష్ణంరాజు, జి నరేష్ తదితరులు పాల్గొన్నారు.