Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- రాష్ట్ర, జిల్లా, కార్పొరేషన్లలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
- నాలా పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు
- భారీ వర్షాల నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి
- నాలా పనులు పూర్తి అయితే భవిష్యత్తు లో నీటి కష్టాలు ఉండవు
- మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని పలు కాలనీల్లో పర్యటించిన విద్యాశాఖ మంత్రి
నవతెలంగాణ-మీర్పేట్
ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారు లను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తెలెత్తకుండా చర్యలు తీసుకోవాలని విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సూచించారు. సోమవారం మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీధర్కాలనీ, బాలాజీనగర్, మిథులనగర్లలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో పడుతున్న భారీ వర్షాల వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురైన ఎదుర్కొవటానికి అధికార యంత్రాంగంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతి నిధులకు సమాయత్తం చేస్తూ ఆదేశాలు ఇచ్చారన్నారు. వర్షాల వల్ల ప్రజలకు ఏమైనా సమస్యలు వస్తే వెంటనే స్పందించటానికి రాష్ట్ర స్థాయిలో సెక్రటేరియట్‌తో పాటు ఆయా జిల్లాల కలెక్టరేట్లు, మునిసిపల్ కార్పొరేషన్లలో 24 గంటలు పనిచేసే ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కాలనీలో నాలా అభివద్ధి పనులు జరుగుతున్నం దున, అక్కడ పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులతోపాటు కార్పొరేటర్లకు మంత్రి ఆదేశిం చారు. ఎస్ఎన్డీపీి నాలా పనులు జరుగుతున్న, భవిష్యత్తులో శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు.
శ్రీధర్కాలనీలో పనులు మూడు బిట్లుగా జరుగుతుం డటంతో కొంత ఆలస్యం జరిగినా ప్రస్తుతం వేగంగా పూర్తి అయ్యేలా చూస్తామని మంత్రి అన్నారు. కార్పొరేషన్‌లోని పలు కాలనీలలో పర్యటించి బస్తీవాసులతో మాటా ్లడారు. ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామన్నారు. ట్రంక్‌లైన్ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షాల కారణంగా మూడు రోజులు విద్యార్థులకు సెలవులు ఇచ్చామన్నారు. ప్రజలు కూడా అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దన్నారు. వర్షం కురిస్తే వచ్చే నీటితో చాలా కాలనీలు ముంపునకు గురయ్యేవని, చాలా వరకు ట్రంకు లైన్, ఇతర నాలాల పనులు జరిగాయని, అందుకే ఈసారి పలు కాలనీలలో ముంపు నుంచి తప్పినట్లు అయ్యిందని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న నాలా పనులను తొందరగా పూర్తిచేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్‌రెడ్డి, ఫ్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి, కమిషనర్ నాగేశ్వర్, ఈఈ, డిఈ, ఎఈ, మీర్పేట్ టీిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు కామేష్ రెడ్డి, కార్పొరేటర్లు, వివిధ కాలనీవాసులు ఉన్నారు.