Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీనగర్
లింగోజిగూడ డివిజన్ పరిధిలోని మైత్రినగర్‌లో జరుగు తున్న వరదనీటి పనులను ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అధికారులతో కలిసి మంగళవారం పర్యటించి పనులను పరిశీలించారు. పనులను వేగవం తంగా చేయాలని ఎమ్మెల్యే గతంలో అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల మీద ఎమ్మెల్యే సంతప్తి వ్యక్తం చేశారు. పనుల్లో వేగం పెరిగిందని తెలిపారు. వరదనీరు పోవడానికి వాటర్ డ్రైన్స్ ఎత్తుపల్లాలను చూసుకొని పనులు వేగవంతంగా పూర్తిచే యాలని సూచించారు. అలాగే డ్రైన్స్ మరియు వాటర్ పైప్‌లైన్స్ పనులు కూడా పూర్తిచేయాలని సూచించారు. కాలనీవాసులు ఎవరూ ఇబ్బందులు పడకుండా వారికి కనీస సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎం.సీ డీ.ఈ.కనకయ్య, డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి, శ్రీకాంత్, నర్సింహగుప్తా, చింతల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.