Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖబర్దార్ బండి సంజయ్
- టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల సతీష్
నవతెలంగాణ-ఓయూ
సీఎం కేసీఆర్‌ని విమర్శిస్తే ఊరుకునేది లేదు అని టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల సతీష్ అన్నారు. కేసీఆర్, కేటీఆర్‌లను వ్యక్తిగతంగా నోటికొచ్చినట్టు మాట్లాడితే నాలుక చీరేస్తాం ఖబర్దార్ బండి సంజరు అని హెచ్చరించారు. మంగళవారం ఓయూ ఫ్యాకల్టీ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పడాల సతీష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాభివద్ధి ప్రధాత సీఎం కేసీఆర్‌ను రెండు, మూడు రోజులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు విమర్శించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అన్నివర్గాల ప్రజలు బాగుండాలని అహర్నిశలు కషి చేస్తున్న కేసీఆర్‌ను విమర్శిస్తే విద్యార్థులుగా, యువకులుగా చూస్తూ ఊరుకోమని తగినబుద్ధి చెబుతామన్నారు. తెలంగాణకు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఏమేమి చేసిందో అని చెప్పాలని అడిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఏ ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా కల్పించకుండా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. బండి సంజరుకి దమ్ముంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తెలంగాణకు మెడికల్ కాలేజీలు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన విశ్వవిద్యాలయం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
నీతి ఆయోగ్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు రూ.24 వేల కోట్లు ఇవ్వమని చెప్పిన తెలంగాణ బీజేపీ నేతలకు సోయిలేదన్నారు. దేశంలో 70 వేల టీఎంసీల నీళ్లుపోతుంటే వాడుకోలేని దౌర్భాగ్య స్థితిలో కేంద్రంలోని బీజేపీ ఉన్నదన్నారు. కానీ మిషన్ భగీరథ అనే గొప్ప కార్యక్రమం సష్టించి ఈరోజు యావత్ తెలంగాణలోని ప్రతి ఇంటికీ తాగునీరు అందుతుంది అంటే అది కేసీఆర్ ఘనతే చెప్పారు. కేంద్రంపై విమర్శిస్తే ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు చేస్తూ రాజకీయ నాయకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివద్ధి, సంక్షేమ రంగాల్లో దూసుకుపోతూ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని స్పష్టంచేశారు. ఇంకోసారి కేసీఆర్ విమర్శిస్తే ఊరుకునేది లేదు అని హెచ్చరించారు. సమావేశంలో టీఆర్ఎస్వై, టీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు రామగళ్ల సుందర్, జిల్లా నాగయ్య, శోభన్ బాబు, కాటం శివ, నాగారం ప్రశాంత్, రవి, బాలు, సురేష్, రవి, నరేష్, మహేష్, చిరంజీవి, నవీన్ పాల్గొన్నారు.