Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరుసగా కురుస్తున్న వర్షాలకు ఇండ్లల్లోకి, రోడ్డుపై పారుతున్న మురుగునీరు
- దుర్వాసనతో అవస్థలు పడుతున్న స్థానికులు
- ఏండ్లుగా ఇదే పరిస్థితి
- పొంగిపొర్లుతున్న డ్రయినేజీ, మ్యాన్‌హోల్స్
- పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి సర్కిల్ గౌతమ్ నగర్ డివిజన్ న్యూ మిర్జాలగూడ పరిధిలోని వెంకటాద్రి నగర్లో ఇరువైపులా రెండు డ్రయినేజీలు ఉండటం వల్ల వర్షాలు వర్షాలు పడితే చాలు డ్రయి నేజీలు పొంగి పొర్లుతుండతో కాలనీలోని స్థానికులు నానా అవస్థ లు పడుతున్నారు. ప్రస్తుతం వరుసగా ఎడతెరిపి లేకుండా కురు స్తున్న వర్షాలతో ఈ డ్రయినేజీలు పొంగిపొర్లి కొన్ని చోట్ల ఇండ్ల ముందుకు, మరికొన్ని చోట్ల ఇండ్లలోకి మురుగునీరు చేరడంతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీ గుండా కిందకి వెళ్లే పెద్ద అండర్ గ్రౌండ్ డ్రయినేజీలోకి కాలనీ గుండా వెళ్లే డ్రయినేజీ కలప టం వల్ల ఎడతెరిపిలేని వర్షాలు పడ్డప్పుడల్లా డ్రయినేజీ వాటర్ వర్షం నీళ్లులో కలవడం వల్ల ఎక్కువు అవుతుంది. దీంతో డ్రయినేజీ వాటర్ తిరిగి వెనక్కి ఫ్లో అవ్వడం వల్ల ఇండ్లల్లోకి వెళ్తున్నాయి. దీనివల్ల రోడ్డు మొత్తం డ్రయినేజీ వాటర్, ఇటు వర్షం నీటితో కాలనీలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపే పరిస్థితి వచ్చింది. గతేడాది కూడా భారీ వర్షాలకు ఇక్కడ ప్రజలు ఇబ్బందులు ఎదు ర్కొన్నారు. ఈసారి కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. తేలికపాటి వర్షానికి కూడా నీరు ఇండ్లలోకి చేరుతూ, నాళాలు పొంగి రోడ్డుపై పారుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి ఇరువైపులా ఉన్న డ్రయినేజీ కాలనీల వాళ్లతో మాట్లాడి డ్రయినేజీ పెద్దగా ఫ్లో అయ్యేలా చూసి సమ స్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. ఇండల్లోకి మురుగునీరు చేరడంతో రోగాలు వచ్చే అవకాశం ఉందశ్రీష, పలు చోట్ల నాళాలు, రోడ్డుపై చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఓవైపు సీజనల్ వ్యాధులు, మరోవైపు కరోనా ప్రమాదం ఉందని స్థానిక కాలనీ వాసులు భయాందోళన చెందుతున్నారు. న్యూ మిర్జాలగూడ పవన్ మోటార్స్ సర్కిల్లో పైపులైన్ నిమిత్తం రోడ్డు తవ్వడంతో నేటికీ పనులు పూర్తి చేయకపోవడంతో రాకపోకలు సాగించే వారికి ఇబ్బందిగా మారుతుంది. అధికారుల సమన్వయ లోపం కార ణంగా నూతనంగా నిర్మించే రోడ్ల సైతం ధ్వంసం అవుతున్నాయి. పవన్ మోటార్స్ పక్క లైన్లో మ్యాన్ హౌల్ పొంగిపొర్లుతున్నా.. ఎన్నో రోజులుగా మురుగునీరు రోడ్డుపైకి పారుతున్నా పట్టిం చుకోనే వారే లేరు. స్థానికులు, స్కూలుకు వెళ్లే విద్యార్థులకు, వాహ నదారులకు ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏండ్లుగా ఇక్కడ ఇదే పరిస్థితి ఉంది.
వెంకటాద్రి నగర్లో వర్షాకాలం నిత్యం అవస్థలే..
మా కాలనీకి ఇరువైపులా డ్రయినేజీలు ఉండటం వల్ల వర్షాలు పడ్డప్పుడు వర్షం నీరు, మురుగునీరు కలవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. డ్రయినేజీ మురుగునీరు తిరిగి వెనక్కి రావడం వల్ల రోడ్లు మురుగు మయంగా మారిపోయి. దీనికి తోడు దుర్గంధం, దుర్వాసనతో పాటు దోమలు, ఈగలు, వద్ధి చందడం వల్ల అనారోగ్యాల బారినపడుతున్నాం.
- సుధాకర్, వెంకటాద్రి నగర్ కాలనీ మెంబర్
ఎమ్మెల్యే, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదు
కాలనీలో డ్రయినేజీ వాటర్ పొంగి తిరిగి వెనక్కి రావడం వల్ల ఇండ్లలోకి మురుగు చేరుతుంది. వర్షాకాలంలోనైతే నిత్యం రోడ్డుపై మురుగు పారుతుండటంతో మట్టి పేరుకుపోతు ంది. దీంతో అనారోగ్యాల బారిన పడుతున్నాం. ఈ సమస్యను కార్పొరేటర్ ద్వారా ఎమ్మెల్యే, మున్సిపల్ అధికారుల దష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదు. ఇప్పటికైనా సంబంధిత మున్సిపల్ అధికారులు, స్థానిక కార్పొరేటర్ స్పందించి మళ్లీ ఒకసారి ఎమ్మెల్యే దష్టికి తీసుకెళ్లి మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి.
- విజయ్ కుమార్, వెంకటాద్రినగర్ కాలనీ కార్యదర్శి
మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు
మూడు రోజుల నుంచి ఎడతెరిపిలేని వర్షాల వల్ల డ్రయినేజీ పొంగి మురుగునీరు రోడ్డుపై పారుతుండటంతో రోడ్డు పాకుడు బట్టి, అక్కడక్కడ నిలిచిపోయిన దుర్గంధం వెదజల్లుతుంది. ఈ విషయం మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వస్తాం.. చూస్తాం.. అంటారే కాని రావడం లేదు. రోడు ్డపై నడవడానికి, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మున్సిపల్ సిబ్బంది వచ్చి మరుగును తీయకపోవడంతో మేమే ఒకపక్కకు లాగి కుప్ప చేసాం. ఇండ్ల ముందు వారాల తరబడి మురుగు పారుతుండటంతో రోగాల బారిన పడుతున్నాం.
- కృష్ణ, వెంకటాద్రి నగర్ కాలనీవాసి