Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
సీఎం సహాయనిధి పేద ప్రజలకు వరం అని టీఆర్ ఎస్ సీనియర్ నాయకులు మేకల రాము యాదవ్ అన్నారు. మంగళవారం గౌతమ్ నగర్ డివిజన్ పరిధి లోని గౌతమ్ నగర్‌కు చెందిన డీఎస్ గాంధీ మత్తికి యాంజియోగ్రామ్ చికిత్స కోసం నిమ్స్ హాస్పటల్లో చికిత్స నిమిత్తం వారి కుటుంబ సభ్యులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ.లక్ష ఎల్ఓసీని టకుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎం.రామచందర్, నవీన్ యాదవ్, నర్సింగరావు, ఎస్.రాజు, డీఎస్ గాంధీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.