Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన
నవతెలంగాణ-హైదరాబాద్
రాజన్నబౌలీ నాలా పనులను త్వరగా పూర్తి చేయాలని సీపీఐ (ఎం) జంగంమేట్ డివిజన్ కార్యదర్శి కృష్ణ నాయక్ డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) సౌత్ జిల్లా ఆధ్వర్యంలో గురువారం జంగంమేట్ డివిజన్లోని పలు బస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ నాలా పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. రోడ్డు మధ్యలో విచ్చిల విడిగా పడిఉన్న మట్టి కుప్పలను సకాలంలో తొలగించకపోవడంతో కనీసం నడవలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. రోడ్డు ప్యాకేజెస్ చేయకుండా నాలుగేండ్ల నుంచి జీహెచ్ఎంసీ అధికారులు నిర్లక్ష్యం వహిచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న లక్ష్మీనగర్, శివాజీనగర్, శివగంగా నగర్, ఛత్రినాక తదితర బస్తీల్లో మట్టి కుప్పలు, డ్రయినేజీ సౌకర్యం సరిగా లేకపోవడంంతో మురుగునీరు రోడ్డుపై పారుతుందన్నారు.జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఇలాంటి పరిస్థితి ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి రోడ్డు ప్యాకేజీలు మట్టి కుప్పలు తీసివేయాలని, డ్రయినేజీ పొంగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త రోడ్డు నిర్మాణం వెంటనే పనులు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు కిషన్, రామ్ కుమార్, రెడ్డి, శ్రీను, ఈశ్వర్, సంతోష్ కుమార్, యాదవ్, శివ నాయక్, అశ్విన్ తదితరులు పాల్గొన్నారు.