Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మార్పీఎస్ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య, వంగపల్లి శ్రీనివాస్
నవతెలంగాణ-అడిక్మెట్
బస్తీల్లో వరద ముంపు బాధితులకు పదివేల రూపాయల ఆర్థిక సహకారం తక్షణమే అందించాలని, వరద నీరు చేరి ఇండ్లు మునిగిన కుటుంబాలకు 5 లక్షల సహాయంతో ప్రభుత్వ ఇండ్లు నిర్మించి ఆదుకోవాలని ఎమ్మార్పీఎస్ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య, వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. గురువారం విద్యానగర్లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బస్తీల్లో ప్రస్తుతం కురిసిన వర్షాలకు నీట మునిగిన ఇండ్ల బాధితులకు పదివేల రూపాయల తక్షణ సహాయంతో పాటు కూలిపోయిన ఇండ్లకు గాను 5లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించి ఆ కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పొట్ట పెంజర రమేష్, వరిగడ్డి చందు, శ్యాం రావు, జీవన్, శ్రీకాంత్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.