Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓయూ విద్యార్థి సంఘాల డిమాండ్
నవతెలంగాణ-ఓయూ
ఓయూలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఎత్తివేత నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు చెందిన బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్య దూరం చేసే కుట్రలో భాగమే ఓయూలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఎత్తివేత నిర్ణయం అని ఆరోపించారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను, ప్రభుత్వ విద్యను ధ్వంసం చేసి, వాటి స్థానాల్లో ప్రయివేటు యూనివర్సిటీలను బలోపేతం చేసేందుకే ఇలాంటి దుర్మార్గపు చర్యలకుపాల్పడుతున్నారని విమర్శించారు. విశ్వవిద్యాలయం స్వయంప్రతిపత్తిని కాపాడాల్సిన వీసీ ప్రొఫెసర్ రవీందర్ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారారని మండిపడ్డారు. తక్షణమే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఎత్తివేత నిర్ణయాన్ని విరమించుకోకపోతే ఓయూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నేత కాంపల్లి శ్రీనివాస్, గిరిజన విద్యార్థి శక్తి శరత్ నాయక్, బీసీ విద్యార్థి సంఘం బొల్లెపల్లి స్వామి గౌడ్, టీవీఎస్ నేత హరీష్ గౌడ్, అంసా నేత సుదర్శన్, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.