Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి
నవతెలంగాణ-బంజారాహిల్స్
దేశాన్ని పాలిస్తున్న బీజేపీ రాబోయే ఎన్నికల్లో తమ మేనిఫెస్టోలో వర్గీకరణ అంశాన్ని చేర్చితే ఆ పార్టీని బొంద పెడతామని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి హెచ్చరించింది. గురువారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమితి నాయకులు చెన్నయ్య మాట్లాడారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం వర్గీకరణ అంశాన్ని తప్పుపడితే రాజకీయ నాయకులు తమ స్వార్థ రాజకీయాల కోసం దళితుల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. సామాజిక న్యాయం పేరుతో పదిహేను శాతంగా ఉన్న ఎస్సీలను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. స్వాతంత్రం సిద్ధించి 70 ఏండ్లు పూర్తి అయిన దేశంలో అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ వివక్ష కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడిప్పుడే దళిత వర్గాలు అభివద్ధి సాధిస్తున్న నేపథ్యంలో వారిని అణగదొక్కి కుట్రలో భాగంగా అగ్రకుల రాజకీయ పార్టీలు ఆయా పార్టీల నాయకులు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ దళితుల మధ్య అగాధాన్ని సష్టిస్తే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించి బొంద పెడతామని ఆయన హెచ్చరించారు.