Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైల్డ్, అడోలెసెంట్ సైక్రియాట్రిస్ట్ డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి
నవతెలంగాణ-బంజారాహిల్స్
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని చైల్డ్, అడోలెసెంట్ సైక్రియాట్రిస్ట్ డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి సూచించారు. ఫస్ట్ వాయిస్ ఆఫ్ విజ్డమ్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వల్ల కలిగే నష్టాలపై ప్రీమియా అకాడమీ గురువారం అవగాహన సదస్సు నిర్వహించింది. ఈకార్యక్రమానికి చైల్డ్, అడోలెసెంట్ సైక్రియాట్రిస్ట్ డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి హాజరై మాట్లాడుతూ సమాజాన్ని డ్రగ్ మహమ్మారి చుట్టుముడుతుందని, మరీ ముఖ్యంగా యువత దీనిబారిన పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. జన్యు కారణాలు, సహచరుల ఒత్తిడి, ఒంటరితనం, నిరాశ వంటివి ఎక్కువగా మానసిక స్థితిగతులను మార్చివేస్తాయని తెలిపారు. సరైన విద్యనందించడం, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుచేయడం వల్ల సమాజానికి పట్టిన డ్రగ్ భూతాన్ని తరిమికొట్టాలన్నారు. కార్యక్రమంలో మానసిక ఆరోగ్య ప్రచారకర్త,పేరెంటింగ్ కోచ్ భార్గవి రెడ్డి, ప్రీమియా అకాడమీ ప్రిన్సిపాల్ తప్తిరావు పాల్గొన్నారు.