Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పనులలో జాప్యం చేస్తే ఉపేక్షించం
నవతెలంగాణ-ఉప్పల్
భారీ వర్షాలతో ప్రజల ఇబ్బందులు నేపథ్యంలో ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి జీహెచ్ఎంసి అధికారులు చిల్కానగర్ టీిఆర్‌ఎస్ నాయకులు ప్రవీణ్‌తో కలిసి చిల్కానగర్ డివిజన్లో పలు ప్రాంతాలలో విస్తతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారీ వర్షాలకు ప్రజలు ఇబ్బందుల గురవుతున్నారని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి అధికారులు ఆదేశించారు.
సీతారామ కాలనీ నుంచి రాఘవేంద్రనగర్ గణేష్ టెంపుల్ వరకు 1 కోటి 80 లక్షల రూపాయలతో నిర్మించిన స్ట్రాం వాటర్ పైప్ లైన్ పైన నూతన సీసీ రోడ్డు నిధులు మంజూరు చేశామని, వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే పనులు ప్రారంభిం చాలని అధికారులను ఆదేశించారు. చిల్కానగర్ ఉప్పల్ ప్రధాన రహదారి కల్వర్టు పనులను పర్యవేక్షించారు. పనులు పూర్తి చేసి చిల్కానగర్ ఉప్పల్ కల్వర్టును ప్రజలకు అందుబాటులో తేవాలని కాంట్రాక్టర్‌ను, అధికారులను ఆదేశించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యధిక నిధులు కేటాయించి ఉప్పల్ నియోజకవర్గం అభివద్ధి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీి ఇంజనీర్ నాగేందర్, డివిజన్ అధ్యక్షులు పల్లె నర్సింగరావు, ప్రధాన కార్యదర్శి కోకొండ జగన్, రామ్‌రెడ్డి, రామానుజన్, బాణాల నారాయణరెడ్డి, రామచందర్, అల్లిబిల్లీ మహేందర్, శ్రీనివాస్ యాదవ్, శ్రీను నాయక్, బాలకష్ణగౌడ్, బింగి శ్రీనివాస్, శ్యామ్, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.