Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15లక్షల విలువల గల 4లీటర్ల హాష్ అయిల్, 3సెల్ ఫోన్లు, ఇద్దరు అరెస్ట్
నవతెలంగాణ-హయత్‌నగర్
గిప్ట్,ప్యాక్‌లు గ్రీస్ డబ్బాల్లో సరికొత్త ఫ్లాన్‌తో హాష్ ఆయిల్‌ను అక్రమంగా రవాణ చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. గురువారం ఎల్బీనగర్లో ఉన్న సీపీ క్యాంప్ కార్యాలయంలో నిందితుల వివరాలను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ మురళీధర్ భగవత్ మీడియాకు వెళ్లడించారు. వైజాగ్‌కు చెందిన కోన శివ, పప్పు నూకరాజులు ఒకే ప్రాంతానికి చెందిన వారు. శివ ప్రస్తుతం డిగ్రీ ద్వీతీయ సంవత్సరం చదువుతున్నాడు. వారితో పాటుగా వైజాగ్‌కు చెందిన సంతోష్‌కుమార్,సంజీవ్ రావులు కలసి వైజాగ్‌లోని లంకెల పాలెం నుండి హైదరాబాద్‌కు హాష్ ఆయిల్‌ను తీసుకువచ్చి హైదరాబాద్‌లో వారికి తెలిసిన వారితో అవసరం ఉన్న కస్టమర్లకు విక్రయించేవారు. కేవలం 40వేల కోసం ఇలాంటి డ్రగ్స్ దొడ్డిదారిన విక్రయించేవారు. హైదరాబాద్‌లో ఒక కేజీ హాష్ అయిల్ 4లక్షల వరకు ఉంటుందని పోలీసులకు తెలిపారు. గురువారం వారిని హయత్‌నగర్‌లోని భాగ్యలత కమాన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 4కేజీల హాష్ అయిల్, 3సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం వాటి విలువ 15లక్షల రూపాయలు ఉంటుందన్నారు. సప్లరు చేసే వ్యక్తులు అయిన సంతోష్ కుమార్, సంజీవ్రావులు పరారీలో ఉన్నట్లు, త్వరలో వారిని కూడా పట్టుకుంటామని సీపీ వెళ్లడించారు. ఈసమావేశంలో ఎల్బీనగర్ జోన్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, ఎస్ఓటీ డీసీపీ మురళీధర్, ఎస్ఓటీ ఏసీపీ వెంకన్న నాయక్, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి, హయత్‌నగర్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు ఉన్నారు.