Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
శరీర భాగాల్లో ఎక్కడ ఎలాంటి లోపం ఉన్నా సరిచేసి, మళ్లీ యథా స్థానానికి, అంతకంటే మరింత అందంగా తయారుచేసే ప్రక్రియే ప్లాస్టిక్ సర్జరీ. భారతదేశంలోనే కాక..యావత్ ప్రపంచంలోనే మొట్టమొదటి శస్త్రచికిత్స నిపుణుడు, శుశ్రుత సంహిత పుస్తకం రాసిన శుశ్రుతుడే ప్లాస్టిక్ సర్జరీ పితామహుడు. 1774లో జెంటిల్మన్స్ మ్యాగజైన్ అనే పత్రికలో లూకస్ అనే బ్రిటిష్ సర్జన్ రాసిన లేఖతో వైద్యం, శస్త్రచికిత్స రంగాల్లో ప్రాచీన భారతదేశ ప్రాధాన్యం తెలిసింది. నుదురు, ముక్కు లాంటివాటిని పునర్నిర్మించే ప్రక్రియ భారతదేశంలో ఓ ఇటుకలు తయారుచేసే వ్యక్తి చెప్పారని అందులో రాశారు. అది చదివిన తర్వాత, యుద్ధంలో గాయపడిన ఓ సైనికుడికి జోసెఫ్ కార్ప్ అనే లండన్ సర్జన్ అదే ప్రక్రియ చేశారు. ఇటీవలి కాలంలో కొన్ని సంచలనాత్మక వార్తల వల్ల ప్లాస్టిక్ సర్జరీ గురించి చాలామంది చెడుగా చెప్పుకొంటున్నారు. కానీ, ప్లాస్టిక్ సర్జన్ల ప్రత్యేకత గురించి సాధారణ ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఆధునిక ప్లాస్టిక్ శస్త్రచికిత్స పరిధి కాస్మెసిస్కు మాత్రమే పరిమితం కాదు. ఇందులో పునర్నిర్మాణం అనే విస్తత ప్రక్రియ కూడా ఉంది. గాయపడిన, తెగిన అవయవాలను తిరిగి అమర్చ డం, చేతి గాయాలు, ఎముకలు బయటకు వచ్చి గాయ పడటం, నరాల గాయాలు, భుజాల నరాలకు అయ్యే గాయాలు, సంక్లిష్టమైన ముఖ గాయాలు, క్యాన్సర్ వల్ల తొలగించిన రొమ్ము పునర్నిర్మాణం, తల, మెడ క్యాన్సర్లలో దవడ, మదు కణజాలాల పునర్నిర్మాణం, చేతి మార్పిడి, గ్రహణం మొర్రి లాంటి జనన లోపాలను సరిదిద్దడం ఇలా ఎన్నో ప్రక్రియల్లో ప్లాస్టిక్ సర్జరీ జోక్యం అవసరం. చేతులు, చెవులు, పుర్రె లాంటివి సరిగా లేకపోడం, కాలిన గాయాలు, కాలిన తర్వాత వచ్చే శారీరక లోపాలను సవరిం చడానికీ ప్లాస్టిక్ సర్జన్ ఉండాల్సిందే. సాధారణ ప్రజానీ కంతో పాటు వైద్యులలో కూడా ఈ స్పెషాలిటీ గురించి, అందుబాటులో ఉన్న చికిత్స పద్ధతుల గురించి అంతగా అవగాహన లేదు. రోగులు ఆలస్యంగా వస్తే శస్త్రచికిత్స ఫలితం సరిగా ఉండదు. ఇది చాలా బాధాకరం. ఉదా హరణకు ఏదైనా అవయవం తెగిపోతే.. ఆ భాగంతో సకాలంలో రోగి ఆస్పత్రికి చేరుకోవాలి. ఆ భాగాన్ని గాజు గుడ్డ, శుభ్రమైన వస్త్రంలో చుట్టి, వాటర్ ప్రూఫ్ కంటైనర్, ప్లాస్టిక్ బ్యాగ్‌లో ఉంచాలి. దీనిని ఐస్‌తో కూడిన కంటైనర్‌లో ఉంచాలి (నేరుగా ఐస్‌లో ఉంచరాదు). మైక్రో షియా (చెవి లేకపోవడం, ఆకారం సరిగా లేకపోవడం) సమస్య ఉన్న పిల్లవాడికి 14 ఏండ్లలోపే పునర్నిర్మాణం చేయాలి. ఆలోపు అయితేనే పక్కటెముక మదులాస్థి గట్టిపడదు. రొమ్ము క్యాన్సర్ ఉన్న మహిళలు ముందస్తుగా గుర్తిస్తే, మాస్టెక్టమీ సమయంలోనే ప్రాథమిక రొమ్ము పునర్నిర్మాణాన్ని చేయించుకోవచ్చు. అందువల్ల మహిళలు క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకోవడం మంచిది. మరీ ముఖ్యంగా కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉంటే ఈ పరీక్షలు తరచూ చేయించుకోవాలి. ప్రపంచ ప్లాస్టిక్ సర్జరీ డేను శుక్రవారం సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో ఘనంగా నిర్వహించారు. హాస్సిటల్ ఎండీ డాక్టర్ బి.భాస్కర్‌రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి కిమ్స్ ప్లాస్టిక్ సర్జరీ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. ఈ హాస్పిటల్ ప్రారంభమైనప్పటి నుంచి ఇక్కడ చేసిన శస్త్రచికిత్సల సంఖ్య పదివేలు దాటినట్లు ప్రకటించారు. ప్లాస్టిక్ సర్జన్లు డాక్టర్ ఎన్.హేమంత్ కుమార్, డాక్టర్ శ్రుతి.కె, డా.వినరు. ఆర్.తాము ఇన్నాళ్లుగా చేసిన కృషిని వైద్యుల కు, సామాన్య ప్రజలకు ప్రదర్శించారు.