Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
కర్ణాటకకు చెందిన ప్రముఖ చిత్రకారుడు జగదీష్ హెచ్ అంబాల్గీ చరిత్ర, ప్రకృతిపై గీసిన చిత్ర ప్రదర్శన ఆకట్టుకున్నది. ఈ ప్రదర్శనను శుక్రవారం ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఇన్చార్జి బుచ్చిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుందరయ్య విజ్ఞాన కేంద్రం అకౌంట్స్ ఇన్చార్జి జోశీల మాట్లాడుతూ జగదీష్ గీసిన చిత్రాలు చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తాయని కొనియాడారు. ఇలాంటి చిత్ర ప్రదర్శనను ప్రభుత్వం ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం మేనేజర్ రమణరావు, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ధర్మానాయక్, ఆర్.శ్రీరామ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.