Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్‌పేట
జల్పల్లి మున్సిపల్లో ముంపు సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులను అధికారులు త్వరిత గతిన పూర్తి చేయాలని చైర్మన్ అబ్దుల్లా సాది, కమిషనర్ సుదర్శన్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ లోని 3వ వార్డులో స్థానిక కౌన్సిలర్ అహ్మద్ కసాదితో కలసి డ్రీమ్ సిటీ, గ్రీన్ సిటీ, నబిల్ కాలనీ, మెట్రో సిటీ కాలనీల్లో పర్యటించి బాక్స్ డ్రైన్ నిర్మాణ పను లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జల్ పల్లి మున్సిపల్ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. వర్షాలు కురిసిన సమయంలో ఆయా కాలనీల ప్రజలు వరద నీటితో ముంపునకు గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్తే మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి రూ.10.60కోట్ల నిధులు మంజూరు చేయించి నట్టు తెలిపారు. ఈ నిర్మాణ పనులు పూర్తి అయితే ఆయా కాలనీల్లో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రషీద్, హమీద్ జైదీ, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.