Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట్
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో భాగంగా శుక్రవారం మినీ జాతర వైభవంగా సాగింది. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు పోటెత్తారు. బోనాల జాతర ముందు వచ్చే శుక్రవారంను మినీ జాతరగా పిలుస్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించగా మరికొంత మంది బోనాలు, సాకను సమర్పించారు. ఆలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు భక్తులు క్యూలైన్లలో బారులుతీరి నిల్చున్నారు. ఆలయ ప్రాంతం మొత్తం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి 10 గంటల వరకు భక్తులు సాధార ణంగా ఉండగా ఆ తర్వాత భక్తులు పోటెత్తడంతో కొద్దిగా ఇబ్బందులు తలెత్తాయి. అధికారులు చేపట్టిన చర్యలతో ఎక్కువ సమయం వేచి చూడకుండానే అమ్మవారిని దర్శించుకున్నారు. మేళతాళాలు, డప్పుల ధరువులతో వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఈ జాతర కొనసాగింది. ఆలయ ఈవో గుత్తా మనోహర్‌రెడ్డి, చైర్మెన్ నుంచి కామేష్ ధర్మకర్తల మండలి సభ్యులు భక్తులకు ఇబ్బంది కలుగ కుండా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ప్రసాదాల పంపిణీ, అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన వారికి శ్రీ ఉజ్జయిని మహంకాళి, మాణిక్యాలమ్మ సేవా సమితి అధ్వ ర్యంలో ఉదయం ప్రసాదాలు పంపిణీ చేశారు. సుమారు 3 వేల మందికి ప్రసాదాలు అందించగా మధ్యాహ్నం సుమారు 15 వేల మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కె.మహేష్, రమణ, నవీన్, మోహన్, ప్రవీన్ యాదవ్, భూషణ్, నరేష్, ప్రశాంత్, శరత్ కాకూర్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.