Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
కరెంట్ షాక్ కొట్టి కింద పడిపోయిన ఓ యువకున్ని సమయస్ఫూర్తితో కానిస్టేబుల్ కాపాడాడు. వివరాల్లోకి వెళ్తే.. మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్‌కి చెందిన అబ్దుల్ ఖాదర్ శుక్రవారం సాయంత్రం పెట్రోలిం గ్ విధులు నిర్వహిస్తూ ఉండగా విద్యుత్ షాక్‌కి గురైన ఓ యువకుని మారేడ్‌పల్లిలో చూశారు. రాకేష్ అనే స్థానికుడుని గుర్తించి వెంటనే సమయస్పూర్తితో సీపీఆర్ చేశాడు. అబ్దుల్ ఖదీర్ అందించిన తక్షణ సహాయం వల్ల రాకేష్ ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. కాగా రాకేష్ ను హాస్పిటల్‌కు తరలించాడు. ఆ తర్వాత రాకేష్ కోల్కొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో స్థానికులు, రాకేష్ బంధువులు అబ్దుల్ ఖదీర్‌కు అభినందనలు తెలిపారు.