Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రముఖ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ అయిన కేఎల్ఎం ఆక్సివా ఫిన్వెస్ట్ కార్యాకలాపాలనను తెలంగాణ లో సమన్వయం చేసుకోవడానికి హైదరాబాద్లో ఒక కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించింది. సీఈఓ మనోజ్ రవి, వైస్ ప్రెసిడెంట్ బిజినెస్ హెడ్ శ్రీకాంత్ నాయర్, ఏరియా మేనేజర్ అనీష్ ప్రారంభోత్సవ కార్యక్ర మంలో పాల్గొన్నారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కేఎల్ఎం ఆక్సివా ఆధ్వర్యంలో 400కుపైగా శాఖల ద్వారా పరిపాలనాపరమైన, వ్యాపార కార్యకలాపాల నిర్వహణ చూసే దిశగా కంపెనీ అడుగులు వేస్తోంది. తెలంగాణలో ఇప్పటికే 40కి పైగా శాఖలు ఉన్నాయి. ఈ ఏడాది చివరికి ఈ సంఖ్యను 100కు విస్తరించే ప్రణాళిక ఉంది. అందువల్ల, బిజినెస్ హెడ్ హైదరాబాద్లో ఉంటారు, ఇక్కడి కార్యకలాపాలన్నింటినీ పర్యవేక్షిస్తారు. తెలంగాణలో మరిన్ని మెరుగైన అవకాశాల కోసం కంపెనీ చూస్తోంది. పారిశ్రామిక అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం పరంగా రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ సూక్ష్మరుణాలకు అవకాశాలు పుష్క లంగా ఉన్నాయి. ఎన్బీఎఫ్సీల అవసరం కూడా చాలా ఉంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎన్బిఎఫ్సీ కావ డంతో, కేఎల్ఎంపై ఎక్కువ అంచనాలు ఉంటాయి. శాఖల ప్రస్తుత పనితీరు, తెలంగాణలో భవిష్యత్తు మార్కెట్ ఆశాజనకంగా కనిపిస్తోంది. కంపెనీ ప్రధానంగా బంగారు రుణాల వ్యాపారంపై దృష్టి సారించింది. దీంతోపాటు ఇంకా పెట్టుబడులు, విదేశీ మారక ద్రవ్యం, నగదు బదిలీ, వ్యక్తిగత రుణాలు, వాహన రుణాలు, సూక్ష్మరుణ సేవలు కూడా ఉన్నాయి. కస్టమర్ల సౌలభ్యం కోసం అన్ని శాఖల్లో ఆధునిక బ్యాంకింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేసినట్టు కంపెనీ సీఈఓ మనోజ్ రవి తెలిపారు. ప్రస్తుతం ఉన్న నాలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఒరిస్సా, గోవా రాష్ట్రాలకు కూడా విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది.