Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరెడ్మెట్
అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం డివిజన్లో కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ శుక్రవారం అధికారులతో కలిసి పర్యటించారు. కౌకూర్ చర్చి కాలనీకి వెళ్లే రహదా రిని పక్కన ఉన్న లే అవుట్ ఆక్రమణకు గురవుతుందని నివాసితులు ఫిర్యాదు చేయడంతో కార్పొరేటర్ టౌన్ ప్లానింగ్ వారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. రోడ్లు, డ్రయినేజీ, కొత్త తాగునీటి లైన్ల కోసం జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులు కలిసి సర్వే చేశారు. అనంతరం హై టెన్షన్ రోడ్డును సందర్శించారు. భారీ వర్షాల కార ణంగా దెబ్బతిన్న బీటీ రోడ్లను పరిశీలించారు. సీసీ, జెట్ ప్యాచర్ ద్వారా గుంతలను పూడ్చారు. ఈ కార్యక్రమంలో ఈఈ రాజు, డీఈఈ మహేష్, ఏఈ రవళి పాల్గొన్నారు.