Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
- ఎల్ఓసీ చెక్కు అందజేత
నవతెలంగాణ-వనస్థలిపురం
సీఎం రిలీఫ్ ఫండ్‌తో ఎంతోమంది పేదలకు లబ్ది చేకూరుతున్నట్టు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. వనస్థలిపురం డివిజన్ శక్తినగర్‌కు చెందిన రవీందర్ రెడ్డి గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో వారి కుటుంబసభ్యులు నిమ్స్ హాస్పిటల్‌ను సంప్రదించారు. ఆపరేషన్‌కు ఖర్చు అయ్యే వివరాలతో కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డిని సంప్రదించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సీఎం సహాయనిధికి దరఖాస్తు చేయించి మంజూరైన రూ.1,50,000 ఎల్ఓసీ చెక్కును అందజే శారు. ఈ సందర్భంగా సుదీర్ రెడ్డి మాట్లాడుతూ పేదల ఆరోగ్య పరిరక్షణకు సీఎం సహాయనిధి దోహదపడుతుందన్నారు. ఈ పథకం పేదలకు వరం లాంటిదన్నారు. పేద ప్రజలు నాణ్యమైన, అధునాతన వైద్య సేవలను పొందేందుకు ఈ సీఎం సహాయనిధి అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలం ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు.