Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట్
శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ రెండు ముఖ ద్వారాలను (ఆర్చీలు) శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. తన వ్యక్తిగత నిధులు రూ.58 లక్షలతో నిర్మించిన ముఖ ద్వారాలను మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, మేయర్ విజయలక్ష్మి, డిప్యూ టీ మేయర్ శ్రీలత, పలువురు కార్పొరేషన్ చైర్మన్లలతో కలిసి మంత్రి తలసాని ప్రారంభించారు. ముందుగా ఓల్డ్ రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్ నుంచి అమ్మవారి ఆలయానికి వచ్చే రోడ్డులో నిర్మించిన ఆర్చీని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన డ్యాన్స్ స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది. అక్కడి నుంచి పోతురాజుల నృత్యా లు, మహిళలు బోనాలు ఇతర వేషధారణలతో కళాకారుల ప్రదర్శనలు భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి. అనంతరం బాటా వద్ద నిర్మించిన ఆర్చీ వద్దకు చేరుకుని మరో ఆర్చీని ప్రారం భించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ సతీమణి స్వర్ణ అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, రావుల శ్రీధర్ రెడ్డి, గజ్జెల నగేష్, మేడె రాజీవ్ సాగర్, ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, దానం నాగేందర్, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.