Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరెడ్ మెట్
వినాయక్ నగర్ డివిజన్ వినాయక్ నగర్ లైన్ నెం.3లో డ్రయినేజీ పొంగుతున్నదనీ, రోడ్డు ఇబ్బందిక రంగా మారిందన్న ఫిర్యాదుతో కార్పొరేటర్ క్యానం రాజ్యల క్ష్మి వెళ్లి పరిశీలించారు. సంబంధిత సిబ్బందిని పిలిపించి ఆ సమస్యను పరిష్కరించారు. అనంతరం సూర్యనగర్‌లో రూ.25 లక్షలతో చేపట్టిన నూతన సీసీ రోడ్డు పనులను ఈఈ లక్ష్మణ్‌తో కలిసి పరిశీలించారు. కాలనీలో నెలకొన్న నీటి ప్రవాహం సమస్యలను ఈఈ తో మాట్లాడి పరిష్క రించే దిశగా సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈ దీపక్, వర్క్ ఇన్స్పెక్టర్ సాగర్, సూర్యనగర్ కాలనీ ప్రెసి డెంట్ సుబ్రహ్మణ్యం, అరుణ, సత్యనారాయణ, సతీష్, చారి, హనుమంతరావు, ప్రభాకర్, సత్యసాయి, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.