Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్‌పేట
మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఉన్న ప్రసిద్ధి చెందిన బాలాపూర్ గణేష్ మండపానికి ప్లాట్ పారం, సీసీ రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తన ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.15లక్షలు మంజూరు చేసినట్టు బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కో-ఆప్షన్ సభ్యులు రఘునందనాచారి తెలిపారు. బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మంత్రి నివాసంలో కలసి కోరిన వెంటనే నిధులు కేటాయించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసినట్టు ఆయన తెలిపారు. గణేష్ దర్శనానికి వచ్చే భక్తులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నా రు. నిరంతరం ప్రజల కోసం, ప్రజా సమస్యల పై స్పంది స్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డికి బాలాపూర్ గ్రామ టీఆర్ ఎస్ నాయకులు, గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలియజేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు వంగేటి లక్ష్మారెడ్డి, కళ్లెం ఎల్లారెడ్డి, బడంగ్ పేట్ మున్సిపాలిటీ ఉపాధ్యక్షులు తిమ్మని గిరీష్, అత్తాపురం శ్రీనివాస్ రెడ్డి, జూకంటి సురేష్ గౌడ్, మురళి, కొప్పుల రాజు, దేవాదాయ కమిటీ అధ్యక్షు లు కొల్లన్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నవారు. అనం తరం పలువురు ఇతర పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయ కులు, తదితరులు పాల్గొన్నారు.