Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాలానగర్
కూకట్పల్లి సర్కిల్ బాలానగర్ డివిజన్ పరిధిలోని ఈ-సేవా నుంచి దర్గా వరకు పెండింగ్లో ఉన్న సీసీ రోడ్డు పనులు పూర్తి కావడంతో నిర్మాణ పనులను ఆదివారం కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి పరిశీలి ంచారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని ఆయా ప్రాంతాలల్లో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో నిధుల మంజూరు చేయించుకుంటూ దశలవారీగా పూర్తి చేస్తున్నామన్నారు. డివిజన్ పరిధిలోని కాలనీలు, బస్తీలలో ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కరిస్తామని తెలి పారు. ఈ కార్యక్రమంలో నాయకులు దేవులపల్లి కృష్ణ మూర్తి, ఆనంద్ రెడ్డి, శ్రీనివాస రావు, మహేందర్ రెడ్డి, భీమారావు, వసంత రావు, తదితరులు పాల్గొన్నారు.