Authorization
Sat March 15, 2025 07:41:59 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
ప్రజలకు దశలవారీగా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి అన్నారు. ఆదివారం నాగారం మున్సిిపల్ 7వ వార్డు సాయి నివాస్ కాలనీలో చైర్మన్, స్థానిక కౌన్సిలర్ గూడూరు సబిత ఆంజనేయులు గౌడ్ మున్సిపల్ నిధులు రూ.10 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రయినేజీ పనులను శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాగారం మున్సిపల్ అభివృద్ధి కోసం పాలకవర్గం నిరంతరం కృషి చేస్తుందన్నారు.