Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
నెక్లెస్ రోడ్డు వద్ద ఆస్య సంస్ధ ఆధ్వర్యంలో వాకథన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లిమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఏ ఒక్కరూ క్యాన్సర్ వ్యాధితో భాధ పడకూ డదని ఆస్య సంస్థ కొన్నేండ్లుగా చేస్తున్న కృషి అభినంద నీయం అన్నారు. క్యాన్సర్ భాధితుల కోసం వారు ఈ విధంగా వాకథన్ను నిర్వహించి, మీకు మేం ఉన్నాం అనే భరోసా కల్పించడం చాలా గొప్ప విషయం అన్నారు. 11 వేల మంది వాలంటీర్లు ఈ ఆస్య సంస్థలో భాగమయ్యా రంటే సమాజ సేవ పట్ల మీకందరికీ ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. తన తరపున ఎలాంటి సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. వైద్య అవస రాలు ఉన్న నిరుపేదలకు మర్రి అరుంధతి హాస్పిటల్లో ఉచిత చికిత్సలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం లో భాగస్వామ్యులైన వాలంటీర్లకు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, ఎంఎల్ఆర్ఐటీ విద్యా సంస్థల వాలంటీర్లకు, సినీ కళాకారులకు ధన్యవాదాలు తెలిపారు.