Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
నాచారం డివిజన్లో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమ య్యారని భారత కమ్యూనిస్టు పార్టీ ఉప్పల్ మండల కార్యదర్శి పి.రామ్ నారాయణ అన్నారు. సీపీఐ నాచారం శాఖ 3వ మహాసభ నాచారంలో నిర్వహించారు. ఈ సమావేశం సీపీఐ సీనియర్ నాయకులు కృపాకర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ నారా యణ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై రాజీలేని పోరా టాలు నిర్వహిస్తున్న ఏకైక పార్టీ సీపీఐ అన్నారు. కానీ, ప్రస్తుత కాలంలో నయా ఉదారవాద విధానాలతో ప్రజా పోరాటాలను పాలకులు నీరుగారుస్తున్నారనీ, ఆ విధానాలతోనే నేడు ప్రతిపక్షాలు సైతం ప్రజా పోరాటాలను నిర్మించడంలో వైఫల్యం చెందుతున్నాయనీ, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అన్నారు. నాచారం డివిజన్లో వార్డు కార్యాలయ నిర్మాణం చేపట్టకుండా అలసత్వం వహిస్తున్నారనీ, వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న లోతట్టు ప్రాంతాల డ్రయినేజీ వ్యవస్థను రూపొందించకుండా కాలయాపన చేస్తున్నారనీ, అర్హులైన లబ్దిదారులకు రెండు పడకల ఇండ్లు, రేషన్ కార్డుల జారీ, పెన్షన్ల, దళిత బంధు వంటి సంక్షేమ పథకాల అమలును పూర్తి స్థాయిలో నెరవేర్చకుండా నిర్లక్ష్యం చేస్తే సీపీఐ ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలను సన్నద్ధం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ ఉప్పల్ మండల సహాయ కార్యదర్శి ధర్మేంద్ర, భారత జాతీయ మహిళా సమాఖ్య ఉప్పల్ మండల అధ్యక్షురాలు సుగుణ, ఏఐటీయూసీ ఆటో యూనియన్ నాయకులు శ్రీనివాస్ పాల్గొన్నారు.
సీపీఐ నాచారం శాఖ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
సీపీఐ నాచారం శాఖ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యదర్శిగా కడియాల శివ, సహాయ కార్యదర్శిగా ఎల్.రజిని, కమిటీ సభ్యులుగా కృపాకర్, సబీనా, రిజివ్వానా, గీతా, సాబీరా శ్రీనివాస్, రాజు, నళిని, సుధీర్, ప్రదీప్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.