Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
నవతెలంగాణ-అంబర్‌పేట
సబ్బండ వర్గాల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ ద్యేయమని ఆంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. సామాజిక వర్గాలకు ఆత్మగౌరవ భవనాలకు స్థలంతో పాటు నిధులు కేటాయిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దుక్కుతోందని స్పష్టం చేశారు. రాష్ట్ర వంజరి కులానికి సీఎం కేసీఆర్ ఉప్పల్ భగాయత్‌లో ఎకరం భూమి కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాలేరు నరేందర్ నేతత్వంలో ఆదివారం గోల్నాక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని రంగాల్లో వెనకబడి ఉన్న వంజరి సామాజిక వర్గం సంపూర్ణ సంక్షేమానికి తన వంతు కషి చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన స్థలంలో భావితరాలకు దోహదపడే విధంగా భవనం నిర్మించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కందారి వెంకటేశం, సాల్వేరు, ముత్తయ్య, కాలేరు రమేష్, సాల్వేరు మల్లేశం, బానుక ఆంజనేయులు, ఎదుగని శ్రీరాములు, లిండేరు అమర్, సాల్వేరు పెద్ద ఆర్జున్, పెంటాడి, సాల్వేరు చిత్తంరావు, కరిపై ప్రవీణ్ కుమార్, ఎదుగని శ్రీరాములు, లిండేరు అమర్, లవంగు పెంటాజీ, అనిల్, సాల్యేరు శ్రీకాంత్, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.