Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీకి ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ జులై 21న హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌వద్ద గల ఇందిరా గాంధీగ విగ్రహం నుంచి ఈడీ ఆఫీసు వరకు నిర్వహించబోయే ర్యాలీని జయప్రదం చేయాలని టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి డా. మల్లు రవి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు నందికంటి శ్రీధర్ కోరారు. సోమవారం మల్కాజిగిరిలో జరిగిన సమావేశంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, ఎ. బ్లాక్ అధ్యక్షులు బండి శ్రీనివాస్‌గౌడ్, మద్దికుంట నవీన్ రెడ్డి, ఏఐసీసీ హ్యూమన్ రైట్స్ యువజన అధ్యక్షుడు రాధా కృష్ణ, శ్రీనివాస్‌రెడ్డి, కుమార్ యాదవ్, సాధు యాదవ్, పరశురాం గౌడ్, ధర్మారెడ్డి, డా.ప్రభాకర్, ప్రవీణ్, నవీన్ యాదవ్, బండి అవినాష్, చెవిటి శ్రీనివాస్ కార్యకర్తలు పాల్గొన్నారు.