Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, పాఠశాల మరియు జూనియర్ కళాశాలల రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు అన్ని వర్గాలు సహకరించాలని వామపక్ష విద్యార్థి సంఘా నేతలు పిలుపునిచ్చారు. జులై 20న వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరిగే బంద్ పోస్టర్ ను మేడిపల్లి అమరవీరుల స్తూపం దగ్గర ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి రాథోడ్ సంతోష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి పుట్ట లక్ష్మణ్... పీడీఎస్‌యూ మేడ్చల్ జిల్లా ఇన్చార్జి నాగరాజులు మాట్లాడుతూ నాణ్యమైన విద్య ప్రతి ఒక్కరి హక్కు, దాన్ని ఉచితంగా అందించడం ప్రభుత్వాల బాధ్యత. ప్రభుత్వాలు ఆ బాధ్యతను విస్మరించడం ఎంత తప్పో, అలా విస్మరించినప్పుడు వ్యతిరేకించకపోవడం కూడా అంతే తప్పు. భగత్‌సింగ్, నేతాజీ, అల్లూరి, చంద్రశేఖర్ ఆజాద్, ఖుదీరాం బోస్ లాంటి వారి వారసు లమైన మనం వారి పోరాట స్ఫూర్తితో మన హక్కులను కాపాడుకుంటూ, అన్యాయాన్ని ఎదుర్కొంటూ, న్యాయాన్ని నిలబెడుతూ నిజమైన విద్యార్థులుగా ముందుకు సాగాలి. విద్యావ్యవస్థలో మార్పుల పేరుతో కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యాపారీకరణ, ప్రైవేటీకరణ, కేంద్రీకరణ, కాషాయీ కరణలను ప్రోత్సహించే నూతన జాతీయ విద్యా విధానం -2020ను తెచ్చింది. ఈ విధానంలో పాఠశాల-కళాశాల అభివద్ధికి సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనకు గాని, ఉపాధ్యాయ-ఉపాధ్యాయేతర సిబ్బంది నియామ కాలకు సంబంధించి గాని, బడ్జెట్‌కు సంబం ధించి గాని, ఎటువంటి ప్రాధాన్యం కల్పించలేదు. ఆరవ తరగతి నుంచే ఒకేషనల్ కోర్సులు పెట్టి విద్యార్థులను విజ్ఞానవం తులుగా చేయడం పక్కన పెట్టి, దేశీయ- విదేశీయ పరిశ్రమలకు, కార్పొరేట్ సంస్థలకు కావలసిన కార్మికు లను, ఉద్యోగులను తయారు చేసే విధంగా ఈ పాలసీ రూపొందించబడింది. ప్రాథమిక విద్యలో ఐదు తరగతు లకు ఐదుగురు టీచర్లను, హైస్కూల్లో సబ్జెక్టు టీచర్లను నియమించకుండా విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి 30:1 లేకుండా విద్యా ప్రమాణాలు ఎలా వస్తాయి? ఈ విధానంలో ప్రతి తరగతిలో పాస్, ఫెయిల్ పద్ధతి లేకుండా కేవలం 3-5-8 తరగతులకు పరీక్షలు పెట్టా లని ఉంది. దీనివల్ల డ్రాప్ అవుట్స్ మరింత పెరుగు తాయి. ఈ నూతన జాతీయ విద్యా విధానాన్ని వెంటనే రద్దు చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యా వ్యవస్థను మొత్తంగా సమాధి చేయడానికి చర్యలు చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాకార్యదర్శి రాము, ఎస్ఎఫ్ఐ నాయకులు విజరు, సుమలత, సాయి, శ్రీనివాస్ ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు అన్వర్, జిల్లా నాయకులు హరీష్, రాజు, శివ నాథ్, రాము, నరేష్ తదితరులు పాల్గొన్నారు.