Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 30 ఏండ్లల్లో ఇదే ఫస్ట్‌టైమ్ : జలమండలి
- తాగానీటిపై అనుమానాలు వద్దు
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరంలో వరుసగా కురుస్తున్న వర్షాలతో జంటజలాశ యాలు, గోదావరి పరివాహక ప్రాంతాలు నీటితో కళకళలాడుతున్నాయి. 30 ఏండ్లలో ఎప్పుడూ కురవని విధంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. శ్రీపాద యెల్లంపల్లి రిజర్వాయర్ నుంచి 172 ఎంజీడి గోదావరి నీటిని సేకరిస్తున్న జలమండలి నగరానికి సరఫరా చేస్తోంది. ఈ రిజర్వాయర్ నుంచి వరదల సమయంలో 12 లక్షల క్యూసెక్కుల వరద నీటి ప్రవాహం కొనసాగింది. అయినా నగరానికి సరఫరా చేసే నీటి నాణ్యత విషయంలో జలమండలి ప్రత్యేక దష్టి సారించింది. మల్లారం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో పూర్తి స్థాయిలో గోదావరి నుంచి తీసుకుంటున్న నీటిని శుద్ధి చేస్తోంది. ఎప్పటికప్పుడు వివిధ దశల్లో, వివిధ ప్రాంతాల్లో ఈ నీటిని జలమండలి క్యూఏటీ బందాలు నీటి నాణ్యత పరీక్షలు చేస్తున్నాయి. ఈ నీరు పూర్తిగా స్వచ్ఛమైదిగా, సురక్షిత మైనదిగా అధికారులు ధృవీకరించారు.
రోగాలు ప్రబలకుండా చర్యలు
వర్షాల నేపథ్యంలో తాగునీరు కలుషితం కాకుండా, రోగాలు ప్రబలకుండా జలమండలి అధికారులు అప్రమత ్తమైన విషయం తెలిసిందే. సీవరేజి ఓవర్‌ఫ్లో సమస్యలు తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టారు. క్షేత్రస్థాయిలో సిబ్బందిని అప్రమత్త చేశారు. మ్యాన్‌హోళ్ల పూడికతీత పనులు పూర్తి చేశారు. ఇప్పటికే గల్లీలు, వరద ప్రభావిత ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నీటి సరఫరాపై స్వయంగా అధికారులే ఆరా తీస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కలుషిత నీరు సరఫరా కాకుండా చర్యలు తీసుకోవడంతోపాటు ప్రజలు ఇండ్లలో నిల్వ చేసుకున్న నీటి నాణ్యతను పరిశీలిస్తున్నారు. నిల్వచేసిన నీటిలో బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉండడం తో అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలతో నేరుగా మాట్లాడి నీటి సరఫరాపై ఆరా తీశారు. రోగాలు ప్రభలకుండా ముందస్తు చర్యలు చేపట్టిన అధికారులు జాగ్రత్తలు తీసుకునేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
తాగడానికి సురక్షితమైందే : జలమండలి
భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా నీటి ప్రవాహనం కొనసాగుతుందని జలమండలి ఎండీ దానకిషోర్ తెలిపారు. నగరంతో పాటు అవుటర్ రింగ్ రోడ్డు పరిధిలోని ప్రాంతాలకు జలమండలి సరఫరా చేస్తున్న గోదావరి నీరు తాగడానికి సురక్షితమైనదేనని అన్నారు. అన్ని చర్యలు తీసుకుని నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఇతర సందేహాలకు, ఫిర్యాదుల కోసం కస్టమర్ కేర్ నెంబరు 155313కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
కలుషితనీరు సరఫరా
సురక్షితమైన నీరు అందుతోందని జలమండలి అధికారులు పేర్కొంటున్నారు. కాగా నగరంలోని పలు ప్రాంతాల్లో నీరు కలుషితమై సరఫరా అవుతోంది. మేడ్చల్ జిల్లా పరిధిలోకి వచ్చే బాలానగర్, చింతల్ డివిజన్ల పరిధిలో నల్లానీళ్లు రంగుమారి వస్తున్నాయి. తాగడానికి ఉపయోగకరంగా ఉండటం లేదు. తాగునీటి సరఫరా పైప్‌లైన్‌లో లోపాలవల్ల డ్రయినేజీ నీరు కలుస్తోందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలే వర్షాకాలం ఆ పై నీళ్లు సక్రమంగా రాకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.