Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
తెలంగాణ ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తోందని రంగారెడ్డిజిల్లా ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శంభీపూర్ రాజు అన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి చేస్తోందన్నారు. జిల్లాలో కొత్త యూనివర్సిటీలు, ఐఐటీ కాలేజీల అభివృద్ధే అందుకు నిదర్శనమని చెప్పారు. సోమవారం కొంపల్లి, బహదూర్‌పల్లి, గాగిల్లాపూర్లలోని ప్రభుత్వ పాఠశాలల్లో దాతల సహకారంతో విద్యార్థులకు నోట్ బుక్కులను పంపిణీ చేశారు. కొంపల్లి మున్సిపల్ చైర్మెన్ సన్న శ్రీశైలం యాదవ్, వైస్ చైర్మెన్, గంగయ్య నాయక్, స్థానిక కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు ఆర్. మంగమ్మ , షేక్ అన్వర్, సత్యమ్మ, బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మెన్ మిద్దెల బాల్ రెడ్డి, దూలపల్లి పీఏసీఎస్ చైర్మెన్ నరేంద్ర రాజు, పీఏసీఎస్ వైస్ చైర్మెన్ రవీందర్ రెడ్డి, ఎంఈఓ ఆంజనేయులు, మున్సిపల్, కమిషనర్ రఘు ప్రధానోపాధ్యాయులు నవత, శకుంతల, మాజీ ఎంపీపీ సన్న కవిత, నాయకులు జే. దేవేందర్, సాయి కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.