Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ నగర నాయకులు విఠల్
నవతెలంగాణ-హైదరాబాద్
జీహెచ్ఎంసీ మున్సిపల్ కార్మికులకు రూ.26 వేల జీతం ఇవ్వాలని సీఐటీయూ నగర నాయకులు విఠల్, మున్సిపల్ నగర కార్యదర్శి శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం గోల్కొండ, అకింపేట్, లంగర్ హౌస్ ఏరియాలో కార్మికుల్ని కలిసి వారి సమస్యలను ఉద్దేశించి మాట్లాడారు. కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, రాంకీ సంస్థ నుంచి కార్మికుల్ని కాపాడాలని కోరారు. ఈనెల 30న నిర్వహించనున్న మున్సిపల్ కార్మికుల మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.