Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టిించుకోని ప్రజా ప్రతినిధులు, అధికారులు
నవతెలంగాణ-బడంగ్పేట్
బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్ గూడ గ్రామంలో ఉన్న పలు డివిజన్లలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ అద్వానంగా మారినా పట్టించుకునే వారు కరువయ్యారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నవ్వారు మల్లారెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లా డుతూ భారీ వర్షాలకు గుంతలమయంగా మారిన రోడ్లతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మీర్ పెట్ నుండి ఆల్మస్గూడకు వచ్చే ప్రధాన రహదారి చాలా వరకు గుంతలు పడి వాహనదారులు రాకపొకలకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, అదే విధంగా అల్మాస్గూడ శ్రీ ఆంజేయస్వామి గుడి సర్కిల్ నుండి రాజీవ్గహకల్ప వరకు వెళ్ళే ప్రధాన రోడ్డు గుంతలు పడడంతో 2, 3వ డివిజన్ల ప్రజలు, ప్రయాణికులకు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. 24వ డివిజన్‌కి సంబంధించిన కోమటికుంట చెరువు పక్కన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ లీకేజీల సమస్యలతో రోడ్డుపైనే మురుగు నీరు పారుతుండటంతో పక్కన ఉన్న ఎంఆర్ఆర్ కాలనీ, వైఎస్సార్ కాలనీవాసులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారని పేర్కొ న్నారు. రాబోవు వారం రోజుల్లో అల్మాస్గూడ, గ్రామ పరిధిలోని వివిధ కాలనీల్లో బోనాల పండుగ ఉత్సవాలు రాబోతున్నాయని, అందుకుగాను మున్సిపాలిటీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధతో అధ్వానంగా మారిన రోడ్లను మరమ్మతులు చేయించాలని కోరారు. అదే విధంగా అక్కడ అక్కడ లీకేజీల అవుతున్న డ్రెయినేజీ మురుగు నీరు రోడ్ల మీదకు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బోనాల ఉత్సవాలు భక్తులు ఘనంగా జరుపకోవడానికి తగిన ఏర్పాట్లు చేయాలని పోచమ్మ గుడి నుండి వర్షిణి ఫంక్షన్ హాల్, కాకతీయ కాలనీ నుండి పోచమ్మ కుంటకట్ట మీద ఇటీవల కురిసిన వర్షాలకు గుంతలు పడి అధ్వానంగా తయారైన రోడ్లకు మరమ్మతులు చేయించాలని కోరారు.