Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
ప్రజావాణిలో ప్రజల సమస్యలను సత్వరమే పరిష్క రించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని ప్రజావాణి హాల్లో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్తో కలిసి ప్రజల నుంచి వచ్చిన వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు ప్రజావాణిలో అందజే సిన సమస్యలపై ఆయా శాఖల అధికారులు, సిబ్బంది వెంటనే స్పందించి వాటిని సత్వరమే పరిష్కరించాలని సూచించారు. దరఖాస్తుదారులు ఇచ్చిన విజ్ఞప్తులు తిరస్క రణకు గురైతే అందుకు గల కారణాలను వారికి తెలియజే యాలని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజావాణిలో మొత్తం 37 దరఖాస్తులు రాగా వాటిని ఆయా శాఖల అధికారులు పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, ఆయాశాఖల జిల్లా అధి కారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.